హాకీ హబ్ రూర్కెలా లోని అద్భుతమైన కొత్త బిర్సా ముండా స్టేడియంలో స్థానిక కుర్రాడు అమిత్ రోహిదాస్ కిక్కిరిసిన ఇంటి జనసమూహము ముందు అద్భుతమైన గోల్ తో భారత్ స్పెయిన్‌ను 2-0తో ఓడింఛీ స్వదేశంలో వరుసగా రెండవ హాకీ ప్రపంచ కప్‌లో భారతదేశం కలల ప్రారంబాని చూడకలిగింది. కానీ పది రోజుల తర్వాత ఆ ఆనందం బుడగలా పేలింది, ఆరవ ర్యాంక్ భారత్ 11వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై ఒత్తిడిలో కుప్పకూలింది, పెనాల్టీ షూటౌట్‌ల ద్వారా ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఆతిథ్యమిచ్చిన మూడు ప్రపంచ కప్‌లలో టాప్-ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్, ఇప్పుడు తొమ్మిదో నుండి 16వ స్థానాల కోసం ఆడుతుంది. భారతదేశం యొక్క అకాల నిష్క్రమణ-టోక్యో ఒలింపిక్స్ నుండి 13 మంది మరియు 2018 ప్రపంచ కప్ నుండి 14 మంది ఆటగాళ్ళు (అక్కడ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు) కలిగిఉన్న- ముఖ్యంగా జట్టు మొదటిసారి ఒలింపిక్ పతక విజేతగా ప్రపంచ కప్‌లోకి ప్రవేశించడము నాలుగు దశాబ్దాలకు పైగా అయినందున, షాక్‌కు గురిచేసింది. పోస్ట్‌మార్టం ప్రారంభమైంది మరియు జట్టులో కొంతమంది గత ప్రదర్శనకారులను వదిలివేయడం గురించి ప్రశ్నలు అడగడం జరిగింది. ఆటగాళ్లను ఎంపిక చేయడం దాని తో బాధ్యత వహించే వారి ప్రత్యేక హక్కు అయినప్పటికీ, కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పేలవమైన పెనాల్టీ కార్నర్ కన్వర్షన్ (26లో ఐదు, ప్రధానంగా ఆఫ్-కలర్ డ్రాగ్-ఫ్లిక్కర్ మరియు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కారణంగా), పోరస్ డిఫెన్సివ్ స్ట్రక్చర్, ఫార్వర్డ్‌ల దిగువ స్థాయి ప్రదర్శన (నాలుగు మ్యాచ్‌లలో నాలుగు ఫీల్డ్ గోల్‌లు), కీలకమైన క్షణాల్లో బాల్ పొసెషన్ కోల్పోవడం మరియు తీవ్రతను కొనసాగించడంలో మొత్తం స్థిరత్వం లేకపోవడం గ్రాహం రీడ్ చే కోచ్చేయబడిన జట్టు దాని సామర్థ్యాన్ని సాధించలేక పోయింది. 94 సర్కిల్ ఎంట్రీల నుండి తొమ్మిది గోల్స్ మరియు గోల్స్‌పై 49 షాట్‌లు భారతదేశం యొక్క కష్టాలను తెలిపే గణాంకాలు. కీ మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ పూల్ దశలో గాయం కారణంగా రూల్ అవుట్ కావడం మరియు న్యూజిలాండ్‌తో జరిగిన షూటౌట్ సమయంలో ఏస్ గోల్ కీపర్ P.R. శ్రీజేష్ గాయపడడం పెద్ద దెబ్బ. షూట్ అవుట్‌ల సమయంలో కొంతమంది అనుభవజ్ఞులైన చేతులకు అవకాశం లభించకపోవడం భారతదేశ అవకాశాలను కూడా దెబ్బతీసి ఉండవచ్చు. ఈ ఏడాది ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ అయిన ఆసియా క్రీడలు మరియు 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారతదేశం రియాలిటీ చెక్ చేసి సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ప్రపంచ కప్ పతకం కోసం భారతదేశం యొక్క 48 ఏళ్ల నిరీక్షణ ఇంకా ఎక్కువైనప్పట్టికి హాకీ ఇండియా ప్రెసిడెంట్ మరియు భారత మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ, ఆందోళన కలిగించే ప్రాంతాలను నొక్కిచెప్పారు, జట్టును తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. హాకీ ఇండియా లీగ్‌ని పునరుజ్జీవింపజేయడం వంటి ప్రణాళికలను అమలు చేయడం ద్వారా భారతీయ యువ ఆటగాళ్లకు నాణ్యమైన ఎక్స్‌పోజర్‌ను అందించడం మరియు డ్రాగ్-ఫ్లికర్ల పెద్ద సమూహాన్ని గుర్తించడం హాకీ స్థాయి ని పెంచడంలో దోహదపడుతుంది.
This editorial has been translated from English, which can be read here.
COMMents
SHARE