న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా జసిండా ఆర్డెర్న్ పదవీకాలం అనేక వరుస సవాళ్లతో సతమతమైంది. 37 ఏళ్ళ వయసులో, లేబర్ నాయకురాలు 2017లో అధికారంలోకి వచ్చారు, “పరివర్తనమైన మార్పు”కు హామీ ఇచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె పదవిని విడిచిపెట్టినప్పుడు, కరోనావైరస్ మహమ్మారి, క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులపై అతి మితవాద శక్తుల దాడులు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి సంక్షోభాలను ఎదురుకోవడం లో ఆమె బాగా గుర్తుంచుకో పడుతుంది. శ్రీమతి ఆర్డెర్న్ సానుభూతి మరియు నైతిక విలువలతో పాతుకుపోయిన నాయకత్వ నమూనాను అందించారు - క్రైస్ట్‌చర్చ్ కాల్పుల్లో ఆమె వ్యవహరించిన విధానం ఒక ఉదాహరణ. మహమ్మారి పట్ల ఆమె చూపిన విధానం మొదట్లో ప్రజాదరణ పొందింది, ఇది 2020 శాసనసభ ఎన్నికలలో లేబర్‌ను కైవసం చేసుకోవడానికి సహాయపడింది. COVID-19 నుండి న్యూజిలాండ్ తలసరి మరణాల రేటు అభివృద్ధి చెందిన ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. ఆమె తన రాజీనామాను ప్రకటించిన విధానం కూడా ఆమె ప్రశంసలను గెలుచుకుంది - ఆమె ఉన్నత పదవిలో కొనసాగడానికి “ట్యాంక్‌లో తగినంత లేదు” అని చెప్పడము - ఇది చాలా మంది నాయకులు అధికారాన్ని సులభంగా వదులుకోని ప్రపంచంలో ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. క్రిస్ హిప్కిన్స్, శ్రీమతి ఆర్డెర్న్ క్యాబినెట్లో COVID ప్రతిస్పందన కోసం మాజీ మంత్రి మరియు ప్రధాన మంత్రి కి ట్రబుల్షూటర్, ఆమె తర్వాత మరియు 2023 ఎన్నికలలో లేబర్‌కు నాయకత్వం వహిస్తారు.
ఆమె నాయకత్వ శైలి విస్తృతంగా ప్రశంసింపబడినప్పటికీ, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదారవాద వర్గాలలో, శ్రీమతి ఆర్డెర్న్ ఆమె ఓటర్లకు చేసిన వాగ్దానాల పై మంచి చేశారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. నివసించడానికి అత్యంత ఖరీదైన దేశా ల్లో న్యూజిలాండ్ ఒకటి. 2017లో, శ్రీమతి అర్డెర్న్ 1,00,000 గృహాలను నిర్మించడం ద్వారా దేశం యొక్క గృహ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రతిజ్ఞ చేశారు, అయితే గత ఐదేళ్లలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే నిర్మించబడింది. గృహాల ధరలు విస్తృతంగా ఎక్కువగానే ఉన్నాయి, అయితే అధిక ద్రవ్యోల్బణం గృహ బడ్జెట్ లో ఒక రంధ్రం మిగిల్చింది. పిల్లల పేదరికాన్ని పరిష్కరిస్తానని (అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లల పేదరికంలో న్యూజిలాండ్ ది అతి చెడు రేటు) మరియు అసమానతలను (దేశ గృహ నికర విలువ లో దాదాపు సగభాగాన్ని అగ్రశ్రేణి 10% నియంత్రిస్తుంది) పరిష్కరిస్తానని ఆమె చేసిన వాగ్దానాలు పతనమయ్యాయి. అంతేకాకుండా, పొరుగున ఉన్న ఆస్ట్రేలియా తెరిచినప్పుడు కూడా కొనసాగిన లాక్డౌన్లు మరియు COVID చర్యలు శ్రీమతి ఆర్డెర్న్ యొక్క ప్రారంభ ఆరాధకుల లో కొంత భాగాన్ని ఆమెకు దూరం చేశాయి. ఆమె ప్రజాదరణలో జారిపోవడం లేబర్ యొక్క ఎన్నికల అవకాశాలను దెబ్బతీసింది, ఇది పార్టీ లో చాలా మంది ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించే లా చేసింది. డిసెంబర్ పోల్ ప్రకారం, లేబర్ మద్దతు 33% ఉండగా, 38% మంది ప్రధాన ప్రతిపక్ష మైన సెంటర్-రైట్ నేషనల్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శ్రీమతి ఆర్డెర్న్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మిస్టర్ హిప్కిన్స్కి ఇప్పుడు ఓడను స్థిరంగా ఉంచడానికి మరియు ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది, ఇది ఒక పెద్ద సవాలు. అతను శ్రీమతి ఆర్డెర్న్ యొక్క తాదాత్మ్య రాజకీయాలను ఒక బలమైన ఆర్థిక దృష్టితో కలపాలి, అది న్యూజిలాండ్ యొక్క నిర్మాణాత్మక ఆర్థిక సమస్యల ను దాని సామాజిక సామరస్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచాలీ.
This editorial has been translated from English, which can be read here.
COMMents
SHARE