డిసెంబర్ 2022 భారతదేశ వస్తువుల ఎగుమతుల లో రెండు సంవత్సరాల లో అత్యంత పతనంగా గుర్తించబడింది, $34.5 బిలియన్ల విలువైన ఉత్పత్తులు రవాణా చేయబడ్డాయి - ఏడాది క్రితం కంటే 12.2% తక్కువ. మూడు నెలల్లో షిప్మెంట్లు తగ్గడం ఇది రెండోసారి ఒక సంవత్సరం పై ఇంకో సంవత్సరం తో పోల్చి చూస్తే, అయితే వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ప్రపంచ ఎదురుగాలి తో భారతీయ వస్తువులు సవాళ్లను ఎదుర్కొంటుందని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. వీటిలో యూరప్ మరియు యు.ఎస్.లో వీస్తున్న మాంద్యం మేఘాలు, చైనాలో COVID-19 పరిస్థితి మరియు కొన్ని మార్కెట్లలో రక్షణవాదం వైపు తిరోగమనం ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలంటే, డిసెంబరులో సంవత్సరం పై ఇంకో సంవత్సరం ఎగుమతి క్షీణతను అతిశయోక్తి చేయడంలో అధిక బేస్ ప్రభావం కూడా పాత్ర పోషించింది. డిసెంబర్ 2021 2021-22లో రెండవ అత్యధిక ఎగుమతులను ($39.3 బిలియన్లు) సాధించింది, అప్పుడు భారతదేశ వస్తువుల ఎగుమతులు రికార్డు స్థాయిలో $422 బిలియన్లను దాటాయి. ఉక్రెయిన్-రష్యా వైరుధ్యం 2022 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనేక షాక్‌లలో ఒకటిగా పరిగణించబడుతున్నదానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు భౌగోళిక రాజకీయ గందరగోళం మధ్య ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ మార్పు కు గురిఐంది, దాని వేగం బలమైన పోస్ట్-పాండమిక్ అధిక పెరుగుదల నుండి పుంజుకుని నత్తిగా అభివృద్ధి పథంలోకి రావడం జరిగింది.
ఈ గందరగోళ సమయాల మధ్య, ఎగుమతి ధోరిణిలను నెలవారీగా చదవడం పరిస్థితిని అంచనా వేయడానికి ఉత్తమ మార్గం. ప్రస్తుతానికి, డిసెంబర్ ఎగుమతి సంఖ్యలు, సెలవుల కంటే ముందు పండుగ షిప్మెంట్ల చివరి బ్యాచ్‌ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ, అక్టోబర్ మరియు నవంబర్ ప్రారంభ వాణిజ్య అంచనాల కంటే బాగానే ఉన్నాయి. ఇంకో మంచి పరిణామము ఏమిటంటే, దిగుమతులు కూడా డిసెంబర్లో 3.5% కుదించబడ్డాయి, నవంబర్ 2020 తర్వాత ఇది మొదటి ఉదాహరణ, అయినప్పటికీ అవి వరుసగా $58.2 బిలియన్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. 2022-23 మొదటి తొమ్మిది నెలలకు, భారతదేశ వస్తువుల ఎగుమతులు ఏడాది క్రితం కంటే 9.1% ఎక్కువగా ఉన్నాయి, నవంబర్ 2022 వరకు నమోదైన 11.1% పెరుగుదల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు ప్రపంచ మాంద్యం భారత వస్తువుల డిమాండ్‌ను మరింత తీవ్రంగా దెబ్బతీస్తుందని అంచనా వేస్తునాయి ప్రస్తుత త్రైమాసికంలో అది ఎంతగా అంటే పూర్తి సంవత్సరం ఎగుమతుల్లో సంకోచంతో ముగించేలాగా. . డిసెంబర్లో, S&P గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం, కంపెనీలు కీలక ఎగుమతి మార్కెట్లలో అతి కష్టం తో కొత్త ఎగుమతి ఆర్డర్లు ఐదు నెలల్లో నెమ్మదిగా పెరిగాయి. U.S. రిటైల్ అమ్మకాలపై తాజా డేటా 12 నెలల్లో అది చాలా పడింది అని మరియు పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించిందని సంకేతాలు ఇచ్చింది, అది భారతదేశం యొక్క అగ్ర ఎగుమతి గమ్యస్థానం కాబట్టి పూర్తయిన వస్తువులు లేదా ఇన్పుట్లకు డిమాండ్ మరింత తగ్గుముఖం పడుతుందని సూచిస్తుంది. చైనా తిరిగి తెరవడంతో, డిమాండ్ తగ్గి పోయినప్పటికీ పోటీ తీవ్రమవుతుంది. ఎగుమతుల కోసం విధి ఉపశమన పథకం లో అవాంతరాలను పరిష్కరించడం మరియు ఇనుము ధాతువు రవాణాపై అడ్డాలను ఎత్తివేయడం వంటి కొన్ని ఇటీవల ప్రభుత్వ చర్యలు సహాయపడ్డాయి, అయితే ఎగుమతి ఇంజిన్ ని బాగా నడిచే విధంగా ఉంచడానికి మరిన్ని స్థూల మరియు వేగవంతమైన సూక్ష్మ-విధాన చర్యలు అవసరం.
This editorial was translated from English, which can be read here.
COMMents
SHARE