నవంబర్ తో పోలిస్తే దాదాపు ₹1.5 లక్షల కోట్ల వద్ద, డిసెంబర్ 2022లో వస్తు, సేవల పన్ను (GST) ప్ర్వహాలు ఒక విధమైన పునరుద్ధరణను సూచిస్తాయి. గత నెల లో ఈ ఆదాయాలు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. నవంబర్ 2022 ఆదాయాలు ఒక సంవత్సరం క్రితం కంటే 10.9% ఎక్కువగా ఉన్నా, అది జూన్ 2021 నుండి ఇప్పటి వరకు చాలా నెమ్మైదన వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ ఆదాయాలు నవంబర్ కంటే 2.5% ఎక్కువగా ఉన్నాయి మరియు సంవత్సరానికి 15.2% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. జూలై 2017లో పరోక్ష పన్ను విధానం ప్రారంభమైనప్పటి నుండి డిసెంబర్‌లో నమోదైన ₹1,49,507 కోట్ల GST కిట్టీ మూడవ అత్యధికం అయితే, ఇది మునుపటి రికార్డుల కంటే చాలా ముఖ్యమైనది. మొదటిది, ఈ పన్నులు నవంబర్‌లో చేపట్టిన ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉన్నందున, అది దేనికి సూచన అంటే పండుగ అనంతర వినియోగదారుల అలసట ను అదిగమించి కర్మాగారాలు మరియు సర్వీస్ ప్రొవైడర్లు అక్టోబర్‌లో ఉన్నదానికంటే ఎక్కువ పనిచేసై అని. రెండవది, GST రాబడులు ఎక్కువగా ఉన్న మరో రెండు సందర్భాలలో — ఏప్రిల్ 2022లో ₹1.67 లక్షల కోట్లు మరియు అక్టోబర్‌లో దాదాపు ₹1.52 లక్షల కోట్లు – పన్ను చెల్లింపుదారుల ఆర్థిక సంవత్సరాంతపు సయోధ్యలు మరియు పండుగలకు ముందు ఖర్చు చేయడం లేదా నిల్వ చేయడం ద్వారా ఈ సంఖ్యలు పెరిగాయి వరుసగా. డిసెంబర్‌లో ఈ పరిస్థితి లేదు. అధిక ద్రవ్యోల్బణం ఈ సంఖ్యలను బలపరిచిందనే వాదనలు పాక్షికంగా మాత్రమే సమర్థించదగినవి - నవంబర్‌లో హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం 11-నెలల కనిష్ట స్థాయి 5.9%కి పడిపోయింది, సేవల ద్రవ్యోల్బణం వరుసగా ఫ్లాట్‌గా ఉంది మరియు వస్తువుల ద్రవ్యోల్బణం 6.2%గా ఉంది, ఇది ఎక్కువ ఐనా మునుపటి నెలల కంటే చాలా తక్కువగా ఉంది. కాబట్టి, ద్రవ్యోల్బణం ఆదాయాన్ని పెంచినట్లయితే, ధరల పెరుగుదల అంతకుముందు నెలల్లో కంటే డిసెంబరులో ఎక్కువ పాత్ర పోషించలేదు.
ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం, ఎనిమిది ప్రధాన రంగాలు నవంబర్‌లో 5.4% వృద్ధిని సాధించాయి. అక్టోబర్‌లో అది కేవలం 0.9%, ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 4% దిగజారింది. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి స్థాయిలు ఈ నెలాఖరులో మాత్రమే తెలియనున్నాయి, GST రాబడులు వస్తు మరియు సేవలకు డిమాండ్ నిలకడగా ఉంది అని సూచిస్తుఊంది. నార్త్ బ్లాక్ మాండరిన్‌లు కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడము చివరి దశ ల్లోకి ప్రవేశించినందున, రాబోయే సంవత్సరానికి ఆర్థిక మార్గం మరియు ఆదాయ ఆకాంక్షలను రూపొందించే సమయంలో తాజా GST ఆదాయము కొంత ఆశను అందిస్తుంది. వరుసగా 10 నెలలకు జీఎస్టీ వసూళ్లు ₹1.4 లక్షల కోట్లకు పైగా ఉండటమే కాకుండా, డిసెంబర్ ఆరోగ్యకరమైన ప్రవాహాలు తో 2022-23 సగటు నెలవారీ వసూళు ₹1.49 లక్షల కోట్లకు చేరాయి. కానీ ఇది అలసత్వానికి దారి తియ్యోదు ఎందుకంటే – ప్రపంచ వయప్తి ఎదురు గాలి కారణంగా ఆర్థిక కార్యకలాపాలలో ఏదైనా మందగమనం ఆదాయాలను కూడా తగ్గిస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత గత నెలలో క్లుప్తంగా సమావేశమై క్లిష్టమైన విషయాలును అలాగే పెట్ట్నన జిఎస్‌టి కౌన్సిల్ ను బడ్జెట్ తర్వాత వెంటనే సమావేశపరచాలి - ఆదాయ ప్రవాహాలను కొనసాగించడంలో సహాయపడటానికే కాకుండా, హేతుబద్ధీకరించబడిన రేట్ స్ట్రక్చర్ ద్వారా మరింత పెంచడం మరియు ఒక దేశం, ఒకే పన్ను పరిధిలోకి ప్రస్తుతం మినహాయించబడిన అన్ని అంశాలు తెచ్చే లక్ష్యంగా పెట్టుకోవాలి.
This editorial has been translated from English, which can be read here.
COMMents
SHARE